నకిలీ మద్యం కేసులో యూట్యూబర్ అల్లాబక్షు అరెస్ట్

by Vemula.Srinu Prasad |

ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

నకిలీ మద్యం కేసులో యూట్యూబర్ అల్లాబక్షు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో నిందితుడు, యూట్యూబర్ అల్లాబక్షు(YouTuber Allahbaksh)ను ఎక్సైజ్ పోలీసులు(Excise Police) అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆయనకు విజయవాడ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నంద్యాల జిల్లా గోస్సాడు మండలం జిల్లెళ్ల గామానికి చెందిన అల్లా‌బక్షు నకిలీ మద్యం కేసులో 16వ నిందితుడిగా ఉన్నారు. కేసు విచారణలో అల్లాబక్షు పాత్ర వెలుగులోకి రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

హైదరాబాద్‌లో 20 ఏళ్ల పాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన అల్లాబక్షు సంవత్సరం క్రితం నంద్యాలకు వెళ్లారు. యూట్యూబ్ ఛానల్ పెట్టి విలేఖరిగా చెలామణి అయ్యారు. హైదరాబాద్ లక్డికాపూల్‌లోని సాయి ప్రింటింగ్ ప్రెస్‌లో నకిలీ మద్యం లేబుళ్లు తయారు చేయించారు. ఇందుకు నిందితులు ఫోన్ పే ద్వారా అల్లాబక్షుకు డబ్బులు జమ చేశారు. మూడు రోజుల క్రితమే విజయవాడలోని అల్లాబక్షు ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలు కంప్యూటర్లను సీజ్ చేశారు. ఈ రోజు ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు.

Next Story