లిక్కర్ కేసు విచారణ .. సిట్ అదుపులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి

by Vemula.Srinu Prasad |

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది....

లిక్కర్ కేసు విచారణ .. సిట్ అదుపులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు(Ap Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్(Former Cm Jagan Mohan Reddy) సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి(Narreddy Sunil Reddy)ని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ సిట్ కార్యాలయం(Vijayawada SIT Office)లో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. గతంలో సునీల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన సిట్‌కు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు లభ్యమయ్యాయి. దీంతో నర్రెడ్డి సునీల్ రెడ్డిని తాజాగా విచారిస్తున్నారు.

కాగా 2019లో జగన్ అధికారం చేపట్టిన తర్వాత నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆరు కంపెనీలను ఏర్పాటు చేశారు. మద్యం ముడుపుల సొమ్ము మళ్లించడానికే ఈ కంపెనీలు పెట్టినట్లు సిట్ అనుమానించింది. ఈ మేరకు గతంలో విశాఖలోని సునీల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Next Story