మద్యం కేసులో ట్విస్ట్ .. 29దాకా ఆగాల్సిందే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-26 17:45:05  IST  )

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

మద్యం కేసులో ట్విస్ట్ ..  29దాకా ఆగాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 29న ఏసీబీ కోర్టు(ACB Court) తీర్పు ఇవ్వనుంది. అయితే వాదనల సందర్భంగా సిట్ అధికారులు(Sit Officers), ప్రభుత్వ న్యాయవాది(Government Advocate) కీలక అభ్యర్థన చేశారు. ఇప్పటివరకూ నిందితులు రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోదవిందప్పను విడివిడిగా విచారించామని, వీరందరిని ఒకేసారి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రాజ్ కేసిరెడ్డిని మూడు రోజులు, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను వారం పాటు కస్టడీ(Custody)కి ఇవ్వాలని సిట్ అధికారులు సైతం విజ్ఞప్తి చేశారు. నిందితులు నలుగురినీ కలిపి ఒకేసారి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ న్యాయవాది సైతం ఏసీబీ కోర్టుకు విన్నవించారు. అలా చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తామని అటు సిట్ అధికారులు సైతం కోర్టుకు వివరించారు. దీంతో 29న కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Next Story