ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ. 441 కోట్ల విలువలైన నిందితుల ఆస్తుల అటాచ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-06 14:10:49  IST  )

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులు కేసిరెడ్డి, వాసుదేవరరెడ్డి, చాణక్యకు సంబంధించిన రూ. 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.....

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ. 441 కోట్ల విలువలైన నిందితుల ఆస్తుల అటాచ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(Ap Liquor Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులు కేసిరెడ్డి(Kesireddy), వాసుదేవరరెడ్డి(Vasudevareddy), చాణక్య(Chanakya)కు సంబంధించిన రూ. 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరోవైపు వారి కుటుంబసభ్యులు, అనుబంధ సంస్థల అస్తులను కూడా ఈడీ అధికారులు జప్తు చేశారు. సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఖజానాకు రూ.4 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు వినిపించాయి.

2019 తర్వాత...

2019 తర్వాత లిక్కర్ పాలసీలో నిందితులు మార్పులు చేసినట్లు అధికారులు గుర్తించారు. పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించినట్లు కూడా బయటపడింది. ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో తేలింది. ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు కిక్‌బ్యాక్ తీసుకున్నట్లు వెల్లడైంది. అటు కమిషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేసినట్లు అధికారులు తెలసుకున్నారు.

ఈ స్కాంలో...

ఇక ఈ స్కాంలో హవాలా మనీ ల్యాండరింగ్ రూపంలో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే పలువురు నిందితులను విచారించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఎంపీ మిధున్ రెడ్డిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నంచారు. పలు కీలక ఆధారాలను రాబట్టారు. దీంతో ఈడీ చర్యల్లో వేగం పెరిగింది.

అటు సిట్ కూడా..

అటు సిట్ కూడా ఈ కేసులో దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించింది. తాజాగా ఏ2 నిందితుడు వాసుదేవరెడ్డిని సైతం ప్రశ్నించింది. రెండు రోజలు పాటు విచారించిన అనంతరం ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు. ఇది జరిగిన గంటల్లోనే వాసుదేవరరెడ్డితో పాటు కేసిరెడ్డి, చాణక్యకు సంబంధించిన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Next Story