ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం.. వెంకటేశ్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-13 11:07:08  IST  )

ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది....

ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం.. వెంకటేశ్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(Ap LIquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు వెంకటేశ్ నాయుడు(Venkatesh Naidu) ఫోన్ అన్‌లాక్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో ఆయన ఫేస్ ఐడీ ద్వారా ఫోన్ లాక్‌ను ఓపెన్ చేయనున్నారు. ఫోన్‌లో ఉన్న వీడియోల ద్వారా కీలక సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.

గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో రూ. 10 కోట్లు దొరికిన విషయం తెలిపిందే. అయితే ఆ వీడియోలకు సంబంధించి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ డబ్బులు దొరికిన సమయంలో కలకలం రేపిన వీడియోను వెంకటేశ్ నాయుడు రిట్రీవ్ చేశారు. దీంతో ఆయన ఫోన్ అన్ లాక్ చేసి ఆధారాలు సేకరించేందుకు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి లభించింది. దీంతో కేసు విచారణను మరింత ముమ్మరం చేయనున్నారు.

కాగా ఈ కేసులో ఏ34 నిందితుడిగా వెంకటేశ్ నాయుడు ప్రస్తుతం జైలులో ఉన్నారు. మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈయన పీఏగా పని చేశారు. దీంతో వెంకటేశ్ నాయుడుపైనా ఆరోపణలు వచ్చాయి.

Next Story