Liquor Case: నర్రెడ్డి సునీల్‌రెడ్డికి చెందిన పది కంపెనీల్లో సిట్‌ సోదాలు

by Vemula.Srinu Prasad |

ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

Liquor Case: నర్రెడ్డి సునీల్‌రెడ్డికి చెందిన పది కంపెనీల్లో సిట్‌ సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్‌ కేసు(AP Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ అధికారులు(SIT officials) దూకుడు పెంచారు. హైదరాబాద్(Hyderabad), విశాఖ(Visakha)లో సోదాలు నిర్వహించారు. నిందితుడు నర్రెడ్డి సునీల్‌రెడ్డి(Narreddy Sunil Reddy)కి చెందిన పది కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌,3 స్నేహా హౌస్‌లోనూ తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్.2, సాగర్‌ సొసైటీలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, ఖైరతాబాద్‌, కమలాపురి కాలనీ ఫేజ్‌1లోని కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్రం లిక్కర్ స్కాం నుంచి ఈ కంపెనీలకు ముడుపులు వెళ్లి ఉంటాయనే ఆరోపణలపై సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు విశాఖలోనూ రెండు కంపెనీల్లో పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితు నర్రెడ్డి సునీల్ రెడ్డి.

Next Story