- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ అప్ డేట్: లిక్కర్ కేసులో పట్టుబడిన రూ.11 కోట్లు సీజ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(AP Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ శివారు ప్రాంతంలో పట్టుబడిన రూ. 11 కోట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court)లో మెమో దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకు, ట్రెజరీలో డిపాజిట్ చేస్తామని వెల్లడించారు.
అయితే హైదరాబాద్(Hyderabad) శివారులో లభ్యమైన రూ. 11 కోట్లు ఎవరివి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ డబ్బులతో తనకు సంబంధం లేదని నిందితుడు కేసిరెడ్డి అంటున్నారు. మరో నిందితుడు వరణ్ ఇచ్చిన సమాచారం పేరుతో సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. దీంతో రూ. 11 కోట్ల ఉంచిన గుట్టు రట్టు అయింది. ఈ డబ్బులు వైసీపీకి చెందిన వాళ్లవేనని సిట్ అనుమానిస్తున్నారు. దీంతో కేసులో మరింత దూకుడు పెంచేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రూ. 11 కోట్ల నగదుపై కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది.






