రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ బాధ్యతలు తహసీల్దార్లకే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-06 08:05:30  IST  )

ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ బాధ్యతలు తహసీల్దార్లకే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయించినట్లు సమాచారం. ఈ తరుణంలో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు(Cancellation of illegal registrations of government lands) అధికారాన్ని జిల్లా కలెక్టర్(District Collector) నుంచి మండల తహసీల్దార్ల(Tahsildars)కు అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి(Revenue Minister) అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గించడంతో పాటు, రిజిస్ట్రేషన్లు రద్దు ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేందుకు ఈ మార్పు దోహదపడుతుందని తెలిపారు. అలాగే మెరుగైన ఫలితాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఇదివరకు నిషిద్ధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములైన అసైన్డ్, నివాస స్థలాల(residential Areas) రిజిస్ట్రేషన్ రద్దు అధికారం జిల్లా కలెక్టర్లకు ఉండేది.

ప్రస్తుతం అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం అందితే, విచారణ జరిపించి, వాటిని రద్దు చేయాలని జిల్లా రిజిస్ట్రార్(District-Registrar) ద్వారా సబ్ రిజిస్ట్రార్‌(Sub-Registrar)కు తెలియజేస్తారు. ఈ విధానం వల్ల కాలయాపనతో పాటు వివాదాలు తలెత్తుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండే తహసీల్దార్ల(Tahsildars)కు నేరుగా రిజిస్ట్రేషన్లు రద్దు అధికారాన్ని కట్టబెడుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Next Story