అసెంబ్లీలో పోలవరంపై కీలక చర్చ.... జాతికి అంకితమిచ్చేది అప్పుడే?

by Vemula.Srinu Prasad |

అసెంబ్లీలో పోలవరంపై కీలక చర్చ జరిగింది..

అసెంబ్లీలో పోలవరంపై కీలక చర్చ.... జాతికి అంకితమిచ్చేది అప్పుడే?
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం(Polavaram)లో ముంపునకు గురయ్యే ఏడు మండలాలను రాష్ట్రానికి ఇవ్వాలని లేనిపక్షంలో ముఖ్యమంత్రి(Chief Minsiter)గా ప్రమాణం చేయనని 2014లో కేంద్రానికి చెప్పానని, ఆ నిర్ణయంతోనే ప్రస్తుతం చాలా ఇబ్బందులు తొలిగిపోయాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పోలవరం పనుల్లో స్పీడు పెంచామని, అందుకే గిన్నిస్ రికార్డు సృష్టించామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress) పాలన కారణంగా పోలవరం ప్రాజెక్టు మళ్లీ మొదటికొచ్చిందని చెప్పారు. తాము వచ్చిన తర్వాత మళ్లీ పనులు వేగవంతం చేశామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story