కొండచిలువతో వ్యక్తి హల్ చల్... జనం దడ.. దడ

by Vemula.Srinu Prasad |

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చెరువులో వల వేసిన వారికి అనుకోకుండా భారీ కొండచిలువ చిక్కింది...

కొండచిలువతో వ్యక్తి హల్ చల్... జనం దడ.. దడ
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పారిపోయే జనాన్ని ఓ వ్యక్తి హడలెత్తించారు. భారీ కొండచిలువను మెడలో వేసుకుని రోడ్డుపై అటూ, ఇటూ తిరిగారు. కొండచిలువంటే తనకు భయం లేదన్నట్టుగా పాటలు పాడుతూ రోడ్డుపై వెళ్తున్న వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో జరిగింది. ఈ రోజు ఆదివారం కావడంతో ద్వారకా తిరుమల శివారు ప్రాంతంలోని చెరువు చేపలను విక్రయించాలని అనుకున్నారు. ఈ మేరకు చెరువులో వల వేసి చేపలు పట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే మత్య్సకారులు వేసిన వలకు భారీ కొండ చిలువ పడింది.

మద్యంమత్తులో...


అయితే ఫూటుగా మద్యం తాగిన లాజర్ అనే వ్యక్తి ఆ కొండచిలువను కర్రతో కొట్టి చంపేశారు. అనంతరం దానిని మెడలో వేసుకుని ద్వారకా తిరుమల వీధుల్లోకి వెళ్లారు. షాపులు ముందు తిరుగుతూ హల్ చల్ చేశారు. దీంతో కొండచిలువ చనిపోయిందని తెలిక చాలా మంది స్థానికులు హడలిపోయారు. ఆ వ్యక్తి చేసిన న్యూసెన్స్‌తో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. చిన్న పిల్లలు అయితే పెద్ద పెద్దగా కేకలు వేస్తూ గందరగోళానికి గురయ్యారు. పరిస్థితిని గమనించిన కొందరు యువకులు.. పాముతో హల్ చేసిన వ్యక్తిని అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story