- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైస్ పుల్లింగ్ పేరుతో మోసం.. డాక్టర్ నుంచి రూ. 1.7 కోట్లు కొట్టేసిన ముఠా
విశాఖలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది....

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రైస్ పుల్లింగ్(Rice Pulling) పేరుతో మహిళా డాక్టర్‌ను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. హైదరాబాద్(Hyderabad)కు చెందిన మహిళా డాక్టర్(Women Doctor) నుంచి ఆరుగురు వ్యక్తులు రూ.1.7 కోట్లు వసూలు చేశారు. మోసం చేశారని తెలియడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. అయినా తనకు న్యాయం జరగడం లేదని మహిళా డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘రైస్ పుల్లింగ్ పేరుతో తన నుంచి కోటి 70 లక్షలను ఆరుగురు తీసుకున్నారని ఆమె తెలిపారు. ఆ తర్వాత మోసం చేశారని తెలిసింది. దీంతో వాళ్లను నిలదీశారు. వాళ్లు నన్ను దుర్భాషలాడారు. ఇంకా చాలా మంది నుంచి డబ్బులు వసూళ్లు చేశారు. నిందితుల్లో ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. అసలు నిందితుడిని పట్టుకోలేదు. మైనర్ కారణాలు చెప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. నాకు పోలీసులు న్యాయం చేయాలి.’’ బాధిత మహిళ తెలిపారు.






