- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. భర్తను చంపి ఇంటి ముందే పూడ్చిపెట్టిన భార్య
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. భర్తను చంపి ఇంటి ముందే భార్య పూడ్చిపెట్టింది...

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur)లో దారుణం జరిగింది. భర్తను చంపి ఇంటి ముందే భార్య హనుమంతును పూడ్చిపెట్టింది. కల్యాణదుర్గం మండలం పాతచెరువులో నాలుగు నెలలక్రితం ఈ ఘటన జరిగింది. అయితే తల్లి, కూతురు మధ్య గొడవ జరగడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లి సుకన్య పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. భర్త మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించే ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికంగా కలకలం
అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్తను చంపి ఏమీ తెలియదన్నట్టుగా ఉండటంతో ప్రజలు విస్మయానికి గురయ్యారు. కారణాలు కనుగొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story






