- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. 1978లో ఇప్పటి అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక 1984 ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అదేవిధంగా 1999, 2004లో రాయచోటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా సుగవాసి పాలకొండ్రాయుడు విజయం సాధించారు.
Next Story






