- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మినీ అంగన్వాడీలకు మహర్దశ
ఏపీలో మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా ప్రమోట్ చేస్తూ మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా ప్రమోట్ చేస్తూ మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలోని 4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి లభించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన మినీ అంగన్ వాడీ కార్యర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ ఇచ్చారు. వీరి గౌరవ వేతనం నెలకు రూ.11,500గా నిర్ణయించారు. మినీ అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బందికి ఇప్పటి వరకు నెలకు రూ.7వేలు గౌరవ వేతనం ఉండగా పెంచి వారికి గుడ్ న్యూస్ వినిపించారు. దీంతో పాటు పది మంది కంటే తక్కువ లబ్ధిదారులు ఉండి కిలోమీటరు పరిధిలోనే మరో కేంద్రం ఉన్న 340 మినీ అంగన్వాడీ కేంద్రాలను సమీప కేంద్రాల్లో విలీనం చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అంగన్వాడీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.






