గుత్తిలో ఘనంగా హిందూ సమ్మేళనం

by Thanuru Gopichand |

అనంతపురం జిల్లాలోని గుత్తిలో (Gooty) హిందూ సమ్మేళనం (Hindu Sammelanam) ఘనంగా జరిగింది.

గుత్తిలో ఘనంగా హిందూ సమ్మేళనం
X

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లాలోని గుత్తిలో (Gooty) హిందూ సమ్మేళనం (Hindu Sammelanam) ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్ గుప్తా పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. సమ్మేళనంలో భాగంగా భారీ ర్యాలీని నిర్వహించారు. కాషాయ జెండాలను పట్టుకొని పుర వీధుల్లో ర్యాలీని నిర్వహించారు. దీంతో వీధులన్నీ శ్రీరామ నామంతో.. జయజయధ్వానాలతో హోరెత్తిపోయాయి. ఉదయం తొమ్మిది గంటలకు పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ర్యాలీ ప్రారంభమైంది. అక్కడి నుంచి గాంధీ సర్కిల్, రాయల్ సర్కిల్ మీదుగా ఫుట్ బాల్ గ్రౌండ్ వరకు సాగింది. అనంతరం భారీ సభను నిర్వహించారు. నిర్వాహకుడు గోపాల్ మాట్లాడుతూ గుత్తిలో హిందూ సమ్మేళనం నిర్వహించడం తొలిసారి అని పేర్కొన్నారు. దేశ సమైక్యతను ప్రతి బింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు హిందువేనని పేర్కొన్నారు. దేశాన్ని ధర్మ, కర్మ, దైవ భూమిగా భావించే ప్రతిఒక్కరూ భారతీయులేనని స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమ్మేళనం జాతీయతకు సంబంధించినదని.. కేవలం ఒక మతం, ఒక వర్గానికి సంబంధించినది కాదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మారాకుల రమణ, పద్మ వాణిబాబు, సుధాకర్ తదితరులున్నారు.

Next Story