ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో అగ్నిప్రమాదం

by Thanuru Gopichand |

వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో (Proddatur) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది.

ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో (Proddatur) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. మున్సిపల్ కార్యాలయం రోడ్డులో ఉన్న ఒక పాత సామాన్ల దుకాణంలో మంటలు ఒక్కసారిగా చెలరేగి వేగంగా వ్యాపించాయి. పోలీసుల వివరాల ప్రకారం దుకాణంలో పాత సామాగ్రి నిల్వ ఉండడం వల్ల మంటలు మరింత ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో పక్కనే ఉన్న నివాసితులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా ఊపిరి ఆడక ఇబ్బంది పడిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వారు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పాత సామాన్ల దుకాణంలోని మంటలు పక్కనున్న దుకాణాలకు, నివాసాలకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మంటలు దాదాపు అదుపులోకి వచ్చినప్పటికీ, దుకాణంలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story