కుప్పంలో అగ్నిప్రమాదం.. కాలిపోయిన కంటైనర్ లారీ

by Vemula.Srinu Prasad |

చిత్తూరు జిల్లా కుప్పంలో అగ్ని ప్రమాదం జరిగింది..

కుప్పంలో అగ్నిప్రమాదం.. కాలిపోయిన కంటైనర్ లారీ
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District) కుప్పం(Kuppam)లో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. అందరూ చూస్తుండగా రోడ్డుపై కంటైనర్ లారీ(Container lorry) దగ్ధం అయింది. రన్నింగ్‌లో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో బయటకు దూకి డ్రైవర్ ప్రాణాలు కాపాడుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే కంటైనర్ మాత్రం పూర్తిగా కాలిపోయింది. తమిళనాడు నుంచి కోల్‌కతాకు పాల ఉత్పత్తులను కంటైనర్ తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంజిన్‌లో మంటలు చెలగేడటంతో ఘటన జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story