ఫార్మా‌సిటీలో ఫైర్.. కార్మికుడు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-08 10:42:23  IST  )

అనకాపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది...

ఫార్మా‌సిటీలో ఫైర్.. కార్మికుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli)లో అగ్నిప్రమాదం జరిగింది. పరవాడ మండలం ఫార్మాసిటీ(Pharmacity)లోని డెక్కన్ రెమెడీస్ కంపెనీ(Deccan Remedies Company)లో రియాక్టర్ వద్ద గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో కార్మికుడు నాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని గాజువాక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నాయుడు మృతి చెందారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యం స్పందించాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం నాయుడు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story