బయో ఎనర్జీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం: తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Vemula.Srinu Prasad |

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామ సమీపంలోని బయో ఎనర్జీ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు...

బయో ఎనర్జీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం: తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) కొవ్వూరు మండలం పంగిడి(Pangidi) గ్రామ సమీపంలోని బయో ఎనర్జీ ప్లాంట్‌(Bio Energy Plant)లో ఒక్కసారిగా మంటలు(Fire) చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాంట్‌లోని ఒక ట్యాంక్‌పై ఉన్న బెలూన్లు ప్రమాదవశాత్తు నిప్పుంటుకుని కాలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగానే దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

అయితే ప్రమాదాన్ని గమనించిన ప్లాంట్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ సమాచారం అందుకున్న కొవ్వూరు తహసీల్దార్ మరియు పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story