కూతురు ప్రేమ వివాహం.. కోపంతో ఆమె బిడ్డను అమ్మేసిన తండ్రి

by Vemula.Srinu Prasad |

కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి.. ఆమెకు పుట్టిన బిడ్డను అమ్మేసిన ఘటన విశాఖలో జరిగింది....

కూతురు ప్రేమ వివాహం.. కోపంతో ఆమె బిడ్డను అమ్మేసిన తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్: కూతురు ప్రేమ వివాహం(Love Marriage) చేసుకోవడం ఇష్టం లేని తండ్రి(Father).. ఆమెకు పుట్టిన బిడ్డను అమ్మేసిన ఘటన విశాఖ(Visakha)లో జరిగింది. అరకు(Araku) ప్రాంతానికి చెందిన పెట్టెల దివ్య స్వరూప.. అదే ప్రాంతానికి చెందిన జాన్ బాబును ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రి శుక్రకి ఇష్టంలేదు. భార్యభర్తలను విడదీసేందుకు చాలా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దివ్య స్వరూప గర్భవతి అయ్యారు. మనస్పర్థలు రావడంతో దివ్య స్వరూప దంపతులు వేరుగా ఉంటున్నారు. దివ్య స్వరూప కేజీహెచ్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే బిడ్డకు పచ్చకామెర్లు ఉన్నాయని, అనారోగ్యంగా ఉందని వైద్యం చేయించాలని చెప్పి దివ్యతో పలు పత్రాల్లో తండ్రి శుక్ర సంతకాలు చేయించారు. అనంతరం దివ్యకు తెలియకుండా మగ బిడ్డను దత్తత పేరుతో వేరొకరికి శుక్ర అమ్మేశారు. రెండు నెలలు అవుతున్నా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి శుక్రను దివ్య నిలదీశారు. అయితే ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేసిన పోలీసులు మూడు గంటల్లోనే బిడ్డ ఆచూకీ కనుగొన్నారు. అనంతరం దివ్యకు అప్పగించారు.

Next Story