దారుణం.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపిన తండ్రి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-21 10:54:47  IST  )

భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలను తండ్రి చంపిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది...

దారుణం.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపిన తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్: భార్య(Wife)పై అనుమానంతో ఇద్దరు పిల్లలను తండ్రి(Father) చంపిన ఘటన కృష్ణా జిల్లా(Krishna District)లో జరిగింది. మైలవరానికి(Mailavaram) చెందిన రవిశంకర్.. భార్య కొన్ని నెలల క్రితం విదేశాలకు వెళ్లారు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న రవిశంకర్.. ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. కానీ ధైర్యం సరిపోకపోవడంతో ఇద్దరు పిల్లలను ఇంట్లోనే చంపారు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఘటనా స్థలంలో లేఖ రాశారు. ఇంట్లో మంచంపై విగతజీవులుగా పడి ఉన్న పిల్లల మృతదేహాలను చూసిన గ్రామస్తులు పోలీసుల సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

అయితే ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి రవిశంకరే పిల్లలను చంపి పారిపోయారని గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా రవిశంకర్‌ను సింహాచలంలో అరెస్ట్ చేశారు. అనంతరం విచారించడంతో తనకు పుట్టలేదనే అనుమానంతోనే పిల్లలను చంపినట్లు నిందితుడు రవిశంకర్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పిల్లలను చంపేందుకు మూడు నెలలుగా ప్లాన్ చేసినట్లు రవిశంకర్ తెలిపినట్లు సమాచారం. మరోవైపు పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story