‘దృశ్యం’ సినిమా తరహా ఘటన: వ్యక్తిని చంపి చెరువులో పడేసిన మహిళ భర్త

by Vemula.Srinu Prasad |

శ్రీసత్యసాయి జిల్లాలో ‘దృశ్యం’ సినిమా తరహా ఘటన కలకలం రేపింది. ..

‘దృశ్యం’ సినిమా తరహా ఘటన: వ్యక్తిని చంపి చెరువులో పడేసిన మహిళ భర్త
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా(Srisatyasai District)లో ‘దృశ్యం’(Drushyam) సినిమా తరహా ఘటన కలకలం రేపింది. 2023లో అమర్నాథ్‌ అదృశ్యమయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు నల్లచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అమర్నాథ్‌ హత్యకు గురయ్యారు. ఆ మిస్టరీ తాజాగా వీడింది. మహిళ స్నానం చేస్తుండగాఅమర్నాథ్‌ వీడియో తీశారు. ఆ తర్వాత తన కోరిక తీర్చాలని బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో అమర్నాథ్ లైంగిక వేధింపులను మహిళ తన భర్త దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మరో ఇద్దరితో కలిసి అమర్నాథ్‌ను మహిళ భర్త హత్య చేశారు. మృతదేహాన్ని చర్లోపల్లి చెరువులో పడేశారు. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులకు తాజాగా కీలక ఆధారాలు లభించాయి. దీంతో అమర్నాథ్‌ను హత్య చేసిన దుండగుల వివరాలు బయటకు వచ్చాయి. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరించడంతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టారు.

Next Story