అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క అరువదు: పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

టీడీపీ (TDP) రెడ్‌బుక్‌‌ను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క అరువదు: పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ (TDP) రెడ్‌బుక్‌‌ను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరిచే కుక్క కరవదని.. కరిచే కుక్క అరవదని సెటైర్లు వేశారు. ఇవాళ కృష్ణా (Krishna) జిల్లా పామర్రు (Pamarru)లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఓ వైపు ఎర్రబుక్కు అంటుంటే.. మనోళ్లు (వైసీపీ) ఏమో రప్పా..రప్పా అంటున్నారని కామెంట్ చేశారు. అలా మన నాయకులు, కార్యకర్తలకు వాళ్లకు బదులిస్తే.. ఇక వాళ్లకు మనకు తేడా ఏంటని ప్రశ్నించారు. జగన్ 2.0 ప్రభుత్వం రాగానే కార్యకర్తలు, నాయకులు ఫ్రీ హ్యాడ్ అని అప్పటి వరకు ఇలా రప్పా.. రప్పా కామెంట్ బంద్ చేయాలని హితవు పిలికారు. చీకట్లో కన్ను కొడితే జరిగిపోవాల్సిన పనులు పట్టపగలు మాట్లాడుకుంటామా.. అంటూ హత్యా రాజకీయాలను ప్రోత్సాహించేలా ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి.

Next Story