Kotappakonda: కోటప్పకొండపై గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తుడు మృతి

by Thanuru Gopichand |

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ వద్ద సోమవారం విషాదం చోటు చేసుకుంది.

Kotappakonda: కోటప్పకొండపై గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తుడు మృతి
X

దిశ, డైనమిక్​ బ్యూరో : పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ వద్ద సోమవారం విషాదం చోటు చేసుకుంది.గిరిప్రదక్షిణ కోసం వచ్చిన భక్తుడు అసవస్థతకు గురై మృతి చెందాడు. గిరిప్రదక్షిణ చేస్తూ ప్రసాద్(50) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కళ్లు తిరిగి వెంటనే కిందపడ్డాడు. భక్తులు దీనిని గమనించి ఆస్పత్రికి తరలించే లోగా ఆయన మృతి చెందాడు. అతని స్వస్థలం చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించారు. వేసవి దృష్ట్యా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అధికారులు సౌకర్యాలు కల్పించారు. అయినా ఇటువంటి విషాద ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story