- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లికి చెప్పుకోగలిగే నిర్ణయం తీసుకోవాలి : మంత్రి నారా లోకేష్
తల్లికి చెప్పుకోగలిగే నిర్ణయమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తల్లికి చెప్పుకోగలిగే నిర్ణయమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో జరిగిన మాక్ అసెంబ్లీలో ముగింపు సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీలో చర్చలు, వాస్తవాలను సాగాలని కానీ ఫ్రస్టేషనుతో కాదన్నారు. ఆవేశాలు, ఎమోషన్లను నియంత్రించుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమన్నారు. కేవలం ఈ ఏడాదికే పరిమితం చేయకుండా ప్రతి ఏడాది మాక్ అసెంబ్లీని కొనసాగిస్తామన్నారు. మహిళలను కించపరిచే మాటలు లేకుండా విద్యార్థి నుంచి నైతిక విలువలను అలవరచుకోవాలన్నారు. ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉంటుందో అక్కడ సుఖసంతోషాలు ఉంటాయన్నారు. మాక్ అసెంబ్లీకి రావడానికి 7 లక్షల మంది విద్యార్థులు పోటీపడడం ఆనందంగా ఉందన్నారు. వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు నేడు ఇక్కడకు వచ్చారన్నారు. చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు కావాలనుకుంటున్నారని.. కానీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదన్నారు. రాజకీయాల్లో కొంత మేరకు నచ్చని అంశాలు ఉండటం వాస్తవం అన్నారు. తనకు కూడా కొన్ని అంశాలు నచ్చవని.. కానీ రాజకీయంలో నిలబడినప్పుడు మాత్రమే సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యమన్నారు.
యువగళం పాదయాత్ర నిర్వహించినప్పుడు రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తాను నడిచానన్నారు. అది తనకెంతో సెంటిమెంట్ అని పేర్కొన్నారు. స్వేచ్ఛా హక్కు, వాక్ స్వతంత్ర్య హక్కు గురించి రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని వివరించారు. విద్యార్థులకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులతో పాటు బాధ్యతల గురించి తప్పక తెలియజేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
తలసరి ఆదాయంలో కాదు.. మానవ సూచీలో కాదు.. నైతిక విలువల్లో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు. అందుకే చాగంటి కోటేశ్వర రావును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినేట్ హోదా ఇచ్చి సలహాదారుగా నియమించారన్నారు. చాగంటి గొప్పతనం ఏమిటంటే ఆయన హోదా వల్ల కలిగే ప్రయోజనాలను సున్నితంగా తిరస్కరించారని మంత్రి లోకేష్ తెలిపారు. అందరి మంచి కోసం తాము శ్రమిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 9600ల పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ విధానం తీసుకొచ్చామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అనుసంధానం కోసం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మేము ప్రభుత్వం తరపున చేయాల్సింది చేస్తాం. సమాజాన్ని లీడ్ చేయాలంటే తల్లిదండ్రుల రోల్ ఉంది. తన తల్లి భువనేశ్వరి నన్ను క్రమశిక్షణగా పెంచారు. చిన్న తప్పు చేసినా కొట్టేవారన్నారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో బాధ్యత ఉంటుందనే విషయానికి ఇది ఉదాహరణగా పేర్కొన్నారు.
తాను తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కార్నింగ్ మెలన్ లో చదివానన్నారు. వరల్డ్ బ్యాంకులో రెండు సంవత్సరాలు పనిచేశామన్నారు. స్లాండ్ ఫోర్డ్ లో ఎంబీఏ చేశామన్నారు. మీకు ఏది ముఖ్యం జీవితంలోనే వ్యాసం అందులో ఉంటుందన్నారు. ఆ ప్రశ్నకు వ్యాసం రాశానని గుర్తు చేశారు. దాన్నే తాను జీవితంలో ఆచరిస్తున్నానని వివరించారు. చదువు తరువాత తాను ఉద్యోగం చేశానన్నారు. హెరిటేజ్ లో 5 సంవత్సరాలు పని చేశామన్నారు. ఆ తరువాతే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. ఎక్కడైనా మంచి చెడులు ఉండడం సహజమన్నారు. కానీ మనం ఏం సాధించాలనుకుంటున్నాం అనే స్పష్టత మనకు ఉండాలన్నారు. చట్టాలను తయారు చేసేది చట్టసభలేనని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ ను సాకారం చేయాలంటే రాజకీయంలోకి వచ్చినప్పుడు సాధ్యపడుతుందన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇతర ప్రొఫెషన్స్ తో పాటు రాజకీయం వైపు కూడా వచ్చేందుకు ఆసక్తి కనబరచాలని కోరారు. మాక్ అసెంబ్లీలో జరిగిన విషయాలను ఇంట్లోవారితో చర్చించాలని విద్యార్థులను కోరారు.






