Breaking: వైసీపీ నేత సజ్జలపై క్రిమినల్ కేసు.. కారణం ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-22 13:12:05  IST  )

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది...

Breaking: వైసీపీ నేత సజ్జలపై క్రిమినల్ కేసు.. కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Ycp Leader Sajjala Ramakrishna Reddy)పై క్రిమినల్ కేసు నమోదు అయింది. అమరావతి మహిళల(Amaravati Women)పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సజ్జలపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష(SC Corporation Director Kambhampati Sirisha) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు(Criminal Case) నమోదు చేశారు. తదుపరి చర్యలపై పరిశీలన చేస్తున్నారు. ఆయనను విచారణకు రావాలని రెండు, మూడు రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. విచారణ అనంతరం పోలీసులు కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు.

మరోవైపు వైసీపీ నాయకులపై ఇప్పటికే వరుస కేసులు నమోదు అయ్యాయి. పలువురు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. ఇప్పడు తాజాగా సజ్జలపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఈ కేసుపై వైసీపీ నాయకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Next Story