- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
22 నెలల వయసులోనే నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన చిన్నారి
కేవలం 22 నెలల వయసులోనే అద్భుతమైన ప్రతిభతో చిన్నారి హన్విక రెడ్డి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేవలం 22 నెలల వయసులోనే అద్భుతమైన ప్రతిభతో చిన్నారి హన్విక రెడ్డి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది. రామగిరి మండలం కలికివాండ్లపల్లి గ్రామానికి చెందిన అఖిల, సుధీర్ రెడ్డిల కుమార్తె గొట్లూరు హన్విక రెడ్డి అద్భుత ప్రతిభతో ఇటీవల నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం గొప్ప విషయం అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. శనివారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వీరికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. కేవలం 1 సంవత్సరం 10 నెలల వయస్సులోనే తల, జుట్టు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మెడ, చేతులు, పొట్ట, కాళ్లు వంటి మానవ శరీర భాగాలను సరైన విధంగా గుర్తించినందుకు గాను నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినట్లు ఆయన తెలిపారు.
7 నెలల వయస్సులోనే 300 ఫ్లాష్ కార్డులను గుర్తించడం ద్వారా నోబుల్ వరల్డ్ రికార్డును సాధించి.. అతి చిన్న వయస్సులోనే విశేషమైన మేధస్సు వికాసాన్ని ప్రతిబింబించిన చిన్నారిగా రికార్డుల్లోకి ఎక్కడం మరో విశేషం అన్నారు. చిన్నారి పదునైన జ్ఞాపకశక్తి, పరిశీలన నైపుణ్యాలు చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే అని కొనియాడారు. ఈ చిన్నారి తో పాటు తల్లిదండ్రులు కూడా నేటి తరానికి ఆదర్శం అని విషెస్ తెలిపారు.






