- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకల్ బాయ్ నానికి బిగ్ షాక్.. కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని విశాఖపట్నం(Vishakapatnam)కి చెందిన లోకల్ బాయ్ నాని ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లలో వీడియోలు పోస్టు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు.

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని విశాఖపట్నం(Vishakapatnam)కి చెందిన లోకల్ బాయ్ నాని ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లలో వీడియోలు పోస్టు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా లోకల్ బాయ్ నాని(Local Boy Nani)కి బిగ్ షాక్ తగిలింది. విశాఖపట్నంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఐపీఎస్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నాని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐపీఎస్ సజ్జనార్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో నాని ఆయనకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే వీసీ సజ్జనర్ ట్వీట్ ని సీరియస్‌గా తీసుకున్న విశాఖ సీపీ వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన సైబర్ క్రైం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇవాళ(ఆదివారం) పోలీసులు నానినీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కేవలం ఒక రీల్ తోనే నాని జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ ఘటన ప్రజెంట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మిగతా సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇక నుంచైనా బెట్టింగ్ యాప్ లను(Online Betting Apps) ప్రమోట్ చేయడం ఆపాలని సూచించారు. మేం అలానే చేస్తాం.. మా ఇష్టం అనుకుంటే మీపై కూడా చట్ట ప్రకారం చర్యలు తప్పవు అని హెచ్చరించారు.






