- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మకానికి ఎమ్మార్వో కార్యాలయం.. ఓఎల్‌ఎక్స్‌లో చూసి బిత్తరపోయిన అధికారులు
గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టడంపై కేసు నమోదు అయింది...

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని(Giddalur MRO office) ఓఎల్ఎక్స్(OLX)లో అమ్మకానికి పెట్టారు. అంతేకాదు ఎమ్మార్మో కార్యాలయం ఎక్కడ ఉందనేది తెలిసేలా లోకేషన్ కూడా షేర్ చేశారు. కేవలం రూ. 20 వేలకే అమ్మకానికి ఉందని, త్వరపడాలని పిలుపునిచ్చారు. ఈ ప్రకటనను ఓఎల్‌ఎక్స్‌లో చూసి రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో ఆకతాయి చేసిన పనిగా గుర్తించారు. ఐడీ మాత్రమే పెట్టి, కంటాక్ట్ నెంబర్ లేకుండా ఓఎల్ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ ఘటన ఎమ్మార్వో కార్యాలయం పని తీరుపై విమర్శలు కురిపిస్తోంది.
Next Story






