రాష్ట్రంలో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడి.. చివరికి!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-21 04:00:31  IST  )

రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

రాష్ట్రంలో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడి.. చివరికి!?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న బాలికను ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో చిన్నారిని గాయపరుస్తూ పలుమార్లు మామిడి తోటలో అత్యాచారం చేసినట్లు సమాచారం. 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసుకు సంబంధించి తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తరచూ ఫోన్లు రావడంతో అతడు ఏమరపాటుగా ఉన్న సమయంలో బాలిక అతని నుంచి తప్పించుకుంది. ఈ తరుణంలో దుండగుడి చెర నుంచి పారిపోతుండగా మరో బాలిక అటుగా రావడం గమనించింది. ఆమెను కిడ్నాపర్ బారి నుంచి రక్షించి అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు

Next Story