AP Elections 2024: వైసీపీకి భారీ షాక్.. ప్రముఖ నేత గుడ్ బై

by Disha Web Desk 3 |
AP Elections 2024: వైసీపీకి భారీ షాక్.. ప్రముఖ నేత గుడ్ బై
X

దిశ, ఉభయగోదావరి జిల్లాల ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ భారీ షాక్ ఇవ్వనున్నారు అమలాపురం ఎంపీ. ప్రస్తుతం అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనురాధ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న చింతా అనురాధ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారని సమాచారం.

ఈ మేరకు ఆమె భర్త టిఎస్ఎన్ మూర్తి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. పి.గన్నవరం టికెట్ హామీ లభించడంతో బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వలేకపోగా ఆమె స్థానే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలుస్తోంది.

ఇక గత కొద్ది రోజులుగా మంత్రి విశ్వరూప్ తో ఆమెకు విభేదాలు ఉండగా సయోధ్య కుదిరేలా పంచాయితీలు కూడా నడిచినా పెద్దగా ఊరట లభించలేదని సమాచారం. ఇటీవల ఓ సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. తనను జగన్ అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని బాహాటంగా చెప్పారు.

దీనితో ఆమె అసంతృప్తికి గురయ్యారు. అది అలా ఉండగా పుండు మీద కారం చల్లినట్లు ఇటీవల ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. అప్పటినుంచి ఆమె వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తులో భాగంగా బిజేపీకి పది అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. బీజేపీ హై కమాండ్ సైతం గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది.

అందులో భాగంగా అమలాపురం ఎంపీ అనురాధకు పిలుపు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె భర్త టిఎస్ఎన్ మూర్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా పి.గన్నవరం అసెంబ్లీ సీటు బీజేపీకి దక్కితే అక్కడ నుంచి పోటీ చేయాలని అనురాధ భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పటివరకు ఆ స్థానం టిడిపి పరిధిలో ఉంది. మహాసేన రాజేష్ కు చంద్రబాబు ఆ స్థానాన్ని కేటాయించటంతో టిడిపి, జనసేన శ్రేణుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అయితే మహాజన రాజేష్ తాను పోటీ చేయడంలేదని ప్రకటించారు.దీనితో అక్కడ నుండి బీజేపీ అభ్యర్థి బరిలో దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ అనురాధ భర్త మూర్తి రందేశ్వరిని కలవడం ప్రాధాన్యత సంతరించు కుంది.

గత ఎన్నికల్లోనే తాను పోటీ చేయాలని భావించానని, కానీ తాను కేంద్ర ప్రభుత్వ సర్వీసు(ఐఆర్ఎస్)లో ఉండటంతో కుదరలేదని ప్రస్తుతం తాను పదవీవిరమణ చేయటంతో క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నందున పోటీకి సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు.

Read More..

BREAKING: టీడీపీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల

Next Story

Most Viewed