అమరావతిలో 13 సంస్థలకు బిగ్ షాక్.. భూ కేటాయింపులు రద్దు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-10 12:18:45  IST  )

ఏపీ రాజధాని అమరావతిలో 13 సంస్థలకు బిగ్ షాక్ తగిలింది..

అమరావతిలో 13 సంస్థలకు బిగ్ షాక్.. భూ కేటాయింపులు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో 13 సంస్థలకు బిగ్ షాక్ తగిలింది. భూ కేటాయింపులు రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ(State Cabinet Sub Committee) నిర్ణయం తీసుకుంది. మంత్రి నారాయణ(Minister Narayana) ఆధ్వర్వంలో అమరావతి సెక్రటేరియట్‌లో భేటీ అయిన ఈ కమిటీ.. రాజధానిలో పలు సంస్థలకు గతంలో కేటాయించిన భూములపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతం(Capital Area)లో మొత్తం 44 సంస్థలకు 2014-19 సమయంలో భూములు(Lands) కేటాయించినట్లు తెలిపింది. అయితే వీటిలో 31 సంస్థలకు భూ కేటాయింపులను కొనసాగిస్తున్న స్పష్టం చేసింది. మరో 13 సంస్థలకు మాత్రం కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు సబ్ కమిటీ పేర్కొంది.

భేటీ అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలని ఆసక్తి ఉన్న ప్రతి కంపెనీకి భూములు కేటాయిస్తామని చెప్పారు. అయితే గతంలో కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ ప్రారంభించని కారణంగా 13 సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నామన్నారు. అమరావతికి లక్షల కోట్లు అవసరం లేదని, సీఆర్డీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు విక్రయించి రాజధానిని నిర్మిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Next Story