- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీకి రూ.8455 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు

దిశ డైనమిక్ బ్యూరో: ఏపీకి రూ.8455 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణకు నిధులు కేటాయించామన్నారు. ఏపీలో మొత్తం రైల్వే అభివృద్ధికి రూ.9417 కోట్లు కేటాయించామన్నారు. యూపీఏ కంటే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువ అన్నారు. రైల్వే వేగం మరింత పెరిగేందుకు చర్చలు చేపడుతున్నామన్నారు. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే పనులు జరుగుతున్నాయని అందుకే బడ్జెట్లో ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరగదన్నారు. హైదరాబాద్ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లను నడుపుతామని ఆయన తెలిపారు. ఇటీవల స్విజర్ల్యాండ్ వెళ్లి అక్కడ రైల్వే ట్రాకులను పరిశీలించామని మంత్రి అన్నారు. రైల్వే ట్రాకుల నిర్వహణలో స్విట్జర్ల్యాండ్ వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు.