- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP DSC: డీఎస్సీకి 5,67,067 దరఖాస్తులు.. ముగిసిన గడువు
ఏపీ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 3,53,598 మంది దరఖాస్తు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 3,53,598 మంది దరఖాస్తు చేసినట్లు అధికారులు ప్రకటించారు. వారి నుంచి 5,67,067 దరఖాస్తులు వచ్చాయి. పలువురు అభ్యర్థులు ఎస్జీటీ, స్కూల్అసిస్టెంట్, పీజీటీకి కూడా ఒకేసారి దరఖాస్తు చేయడంతో దరఖాస్తుల సంఖ్యపెరిగింది. దరఖాస్తుల తుది సంఖ్య తేలాల్సి ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. డీఎస్సీని ప్రక్రియను నిరాటంకంగా కొనసాగించేందుకే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. జూన్ 6వ తేదీ నుంచి పరీక్షలు జరగబోతున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ ఫైనల్ కూడా అయింది. అయితే చాలా మంది 90 రోజుల పాటు ఈ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం కావాలని అడుగుతున్నారు. నిరుద్యోగుల నుంచి.. మెగా డీఎస్సీ ప్రకటన చేసినప్పటి నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తోంది.
కానీ దీనిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా మెగా డీఎస్సీ గడువు పొడగింపు పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా డీఎస్సీ ని (Mega DSC) ఆపడానికి వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కొంత మంది టైం పెంచాలని కోరుతున్న మాట వాస్తవమేనని వివరించారు. సిలబస్ ను తాము డిసెంబర్ నెలలోనే ఇచ్చేసామని... ఆ గడువు ఏడు నెలలు పూర్తయిందని గుర్తు చేశారు. ఇక నారా లోకేష్ (Nara Lokesh) వ్యాఖ్యల తో.. మెగా డీఎస్సీ గడువు పెంపు లేదని క్లారిటీ వచ్చేసింది. ఈసారి ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనుండటంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఉపాధ్యాయ నియామకాలకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది.






