RTC బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. 55 మంది సేఫ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-23 09:21:06  IST  )

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం (Annavaram) దేవస్థానంలోని ఘాట్‌ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది

RTC బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. 55 మంది సేఫ్
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం (Annavaram) దేవస్థానంలోని ఘాట్‌ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న పెళ్లి బృందం ఆ బస్సు వెనక్కి పడుతున్నట్లు అనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సును ఆపేశారు. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. నర్సీపట్నం నుంచి అన్నవరం కొండ పైకి పెళ్లి చేయడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నర్సీపట్నం నుంచి అన్నవరం కొండపైకి పెళ్లి బస్సు వస్తోంది. ఈ క్రమంలో ఎగువ ఘాట్ రోడ్డులోని మూడో మలుపు తిరుగుతుండగా యాక్సిల్ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు వెనక్కి దొర్లింది. అయితే సమయస్ఫూర్తితో బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ఈ ప్రమాద సమయంలో బస్సు(BUS)లో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌కి అంతరాయం కలగకుండా బస్సును ట్రాక్ట్రర్ సాయంతో భద్రతా సిబ్బంది తొలగిస్తున్నారు.

Next Story