40 కేజీల గంజాయి.. ముగ్గురు మహిళలు

by Thanuru Gopichand |

గంజాయి అక్రమ రవాణాకు మహిళల వినియోగం.

40 కేజీల గంజాయి.. ముగ్గురు మహిళలు
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో (Visakapatnam) మరోసారి గంజాయి (Marijuana) గుప్పుమంది. పోలీసుల తనిఖీలో 40 కేజీల గంజాయి బయటపడింది. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం గాజువాక ప్రాంతంలో గంజాయి తరిలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పాత గాజువాక ప్రాంతంలో ముమ్మర తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులను పోలీసు సిబ్బంది గుర్తించారు. ఆ బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి బయటపడింది. సుమారు 40 కేజీల (40 Kgs) వరకు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గంజాయిని తరలిస్తున్న ముగ్గురు మహిళలను (Three Women) అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కేసును నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ జరిగిన దాఖలాలు ఉన్నాయి. మరోసారి గంజాయి ఉనికి బయటపడడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పట్టుబడిన వారే కాకుండా వారి వెనుక ఉన్న ముఠాల గుట్టును కూడా రట్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.

Next Story