386 మంది ఇరిగేషన్ ఉద్యోగులకు కేసుల నుంచి విముక్తి

by Anil Sikha |
386 మంది ఇరిగేషన్ ఉద్యోగులకు కేసుల నుంచి విముక్తి
X

దిశ డైనమిక్ బ్యూరో: జగన్ పాలనలో జలవనరుల శాఖను విధ్వంసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి లో గోదావరి ఏటిగట్టు పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వహణ సరిగా లేక ఏటి గట్లు బలహీనంగా మారి ప్రమాదకరంగా తయారయ్యాయి అన్నారు. జగన్ నిర్లక్ష్యం చేసిన ఏటిగట్లను బలోపేతం చేస్తున్నామన్నారు. ఇరిగేషన్ శాఖలో పెండింగ్ లో ఉన్న పదోన్నతులు పూర్తికి ఆమోదం తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 386 మంది ఇరిగేషన్ శాఖ ఉద్యోగులపై కేసులు పెట్టిందన్నారు. ఆ కేసు నుంచి వారిని విముక్తి చేసామని తెలిపారు

Next Story

Most Viewed