- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP University jobs: వర్సిటీల్లో 3,282 పోస్టులు ఖాళీ.. ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తాం.. లోకేశ్ గుడ్న్యూస్
ఏపీలో ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీలన్నీ ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఉన్న యూనివర్సిటీల్లో (University) ఖాళీలన్నీ ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. వన్ మ్యాన్ కమిషన్ (One man comission) రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తాం అన్నారు. విశ్వవిద్యాలయాల్లో 4,330 శాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం 1,048 పోస్టులు భర్తీ చేశారు. 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తాం అన్నారు. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ ఏపీలో జీఆర్(గ్రాస్ ఎన్ రోల్ మెంట్) రేషియో 36.5 శాతం, ఢిల్లీ 49 శాతం, తమిళనాడులో 47శాతంగా ఉంది. రాష్ట్రంలో చిత్తూరు, గుంటూరులో 45శాతం కంటే ఎక్కువగా ఉందన్నారు. అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళంలో 30 నుంచి 35 శాతం మధ్య ఉంది. మహిళల విషయానికి స్టెమ్ కోర్సుల్లో తక్కువగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 1,400 మాత్రమే పేటెంట్ ఫైలింగ్స్ జరిగాయన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో మనం 9వ స్థానంలో ఉన్నామని వెల్లడించారు. పీహెచ్ డీ (PHD) విద్యార్థుల విషయానికి వస్తే ఏపీలో 5,600 మంది ఉంటే.
తమిళనాడులో 29వేల మంది ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లీప్(లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఏపీ) పేరుతో సెక్టర్స్ స్పెసిఫిక్ ఇన్ స్టిట్యూషన్స్ పై దృష్టి పెట్టి కాలేజీలు, పాలిటెక్నిక్ లు, ఐటీఐ, యూనివర్సిటీలతో క్లస్టరింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏయూలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (Center for exelence) ఏర్పాటుచేయాలని ఎన్వీడియాను కోరాం అన్నారు. స్టార్టప్ ఇంక్యుబేషన్ బలోపేతం చేస్తాన్నారు. బడ్జెట్ లో కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు రూ.2వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. డీఎస్సీ విషయంలో గతంలో జరిగిన తప్పులను స్టడీ చేసి న్యాయపరమైన వివాదాలకు తావులేకుండా పకడ్బందీ నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో నియామకాల అంశం కూడా కోర్టులో ఉంది. దీనిపై ఏజీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపూఆరు. ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) ర్యాకింగ్స్ లో ఏపీ 9వ స్థానంలో ఉంది. 3 వ స్థానానికి తీసుకురావాలనేది లక్ష్యం. క్యూఎస్ ర్యాంకింగ్ లో టాప్-100లో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.






