Tirumala:31 కంపార్ట్‌మెంట్లు ఫుల్.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-18 02:02:56  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

Tirumala:31 కంపార్ట్‌మెంట్లు ఫుల్.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమలలో భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారాలతో సంబంధం లేకుండా తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. దీంతో దర్శనం కూడా ఆలస్యంగా మారుతుంది. ఈ క్రమంలో ఇవాళ 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(శుక్రవారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 56,279 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,019మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.59 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.

Next Story