30 అడుగుల క్రేన్ చూస్తుండగానే దగ్ధం

by Thanuru Gopichand |

చూస్తుండగానే 30 అడుగుల క్రేన్ నిట్టనిలువునా కాలిపోయింది. నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న ఈ భారీ యంత్రం సాంకేతిక సమస్య కారణంగా దగ్ధమైనట్లు (Fire Accident) తెలుస్తోంది.

30 అడుగుల క్రేన్ చూస్తుండగానే దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : చూస్తుండగానే 30 అడుగుల క్రేన్ నిట్టనిలువునా కాలిపోయింది. నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న ఈ భారీ యంత్రం సాంకేతిక సమస్య కారణంగా దగ్ధమైనట్లు (Fire Accident) తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం బాపట్ల జిల్లాలోని చీరాల మండలం పరిధిలో ఉన్న ఆదినారాయణపురం (Adi Narayanapuram) సమీపంలో హైవే పనులు జరుగుతున్నాయి. వాడరేవు-పిడుగురాళ్ల హైవే పనుల (Highway Works) నిమిత్తం భారీ క్రేన్ ను వినియోగిస్తున్నారు. ఇనుప సామాగ్రిని క్రేన్ సహాయంతో ఎత్తులకు చేరుస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అకస్మాత్తుగా క్రేన్ లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే క్రేన్ పై వరకు మంటలు విస్తరించాయి. దీంతో క్రేన్ మంటలకు దగ్ధమైంది. ఇది గమనించిన సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అదే సమయంలో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే చర్యలను చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే క్రేన్ ప్రధాన భాగం ఈ మంటల్లో దగ్ధమైనట్లు అక్కడి సిబ్బంది పేర్కొంటోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా నిప్పు అంటించారా? షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story