- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ.. GADకి అటాచ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు
2018 గ్రూప్-1 అధికారుల నియామక లోపాలపై విచారణ నేపథ్యంలో 26 మందిని అప్రధాన్య పోస్టులకు బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 2018 బ్యాచ్ గ్రూప్-1 అధికారుల నియామక ప్రక్రియపై ఏపీ హైకోర్టు (AP High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రిక్రూట్‌మెంట్‌లో జరిగినట్లుగా భావిస్తున్న లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు, సంబంధిత అధికారులను అప్రాధాన్య పోస్టుల్లోనే (Non-focal posts) ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. 2018 గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ వివాదంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ నియామకాల్లోని అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందర్ తక్షణమే స్పందించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న 26 మంది అధికారులను వారి ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి, సాధారణ పరిపాలన శాఖ (GAD)కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా పరిణామంతో గత రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో దొర్లిన లోపాలపై పూర్తిస్థాయి విచారణ ముగిసి, తుది తీర్పు వచ్చే వరకు సదరు అధికారులను అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఈ మూకుమ్మడి బదిలీలు రాష్ట్ర అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారాయి.






