గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-28 03:04:56  IST  )

ఏపీ నంద్యాల జిల్లా చాపిరేవులలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమదం జరిగింది.

గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ నంద్యాల(Nandyala) జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. చాపిరేవులలో తెల్లవారుజామున అందరూ నిద్రస్తుండగా ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్‌ సిలిండర్‌ పేలి(Gas Cylinder Explosion) ఇద్దరు మృతిచెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతులు దినేష్(10), సుబ్బమ్మ(60)గా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి(Govt hospital)కి తరలించారు. అయితే అందరూ నిద్రిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో బాధితులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.

ఓ ఇంట్లో సోమవారం రాత్రి సమయంలో సిలిండర్ సరిగ్గా ఆఫ్ చేయకపోవడంతో.. గ్యాస్ ఇల్లంతా వ్యాపించింది. అయితే, మంగళవారం తెల్లవారుజామున లేచిన వృద్ధురాలు సుబ్బమ్మ లైట్ వేయగానే ఒక్కసారిగా సిలిండర్ పేలి, మంటలు వ్యాపించాయి. భారీగా శబ్దం చేస్తూ రెండు ఇళ్లు కూలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, శిథిలాల కింద ఉన్న మృతులను బయటికి తీశారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.

Next Story