- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
18 లక్షల మందిపై మొంథా ప్రభావం
మొంథా తుపాను(Cyclone Montha) ఏపీని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుపాను(Cyclone Montha) ఏపీని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, విశాఖపట్టణం జిల్లాలపై తీవ్రంగా పడింది. కాగా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రంగంలోకి దిగారు అధికారులు. ఇప్పటివరకు తుఫాను వల్ల ఇద్దరు మృతి చెందగా.. 10 మంది వరకు గాయపడ్డట్టు సమాచారం. మొత్తం 49 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాను ప్రభావం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు చాలా చోట్ల అరటి తోటలు, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. అలాగే విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంబాలు పడిపోవడంతో 200 కు పైగా గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. ప్రాథమిక అంచనా నివేదికను రెండ్రోజుల్లో అధికారులు ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందించనుంది.
READ MORE ....






