ఫోర్జరీ సంతకాల కేసు.. మాజీ మంత్రి కాకాణికి జ్యుడీషియల్ రిమాండ్

by Naga Rani Yarlagadda |

ఫోర్జరీ సంతకాల కేసు (Case of forged signatures)లో మాజీ మంత్రి కాకాణి (Ex Minister Kakani)కి నెల్లూరు అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఫోర్జరీ సంతకాల కేసు.. మాజీ మంత్రి కాకాణికి జ్యుడీషియల్ రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోర్జరీ సంతకాల కేసు (Case of forged signatures)లో మాజీ మంత్రి కాకాణి (Ex Minister Kakani)కి గోవర్థన్ రెడ్డి నెల్లూరు అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రభుత్వ భూములను తారుమారు చేసేందుకు వెంకటాచలం తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు కాకాణిపై వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న కాకాణిని వర్చువల్ విధానంలో కోర్టు ముందు హాజరు పరచగా.. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని, కాకాణిని 14వ నిందితుడిగా చేర్చారని ఆయన తరపు లాయర్లు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి శారదరెడ్డి ఆగస్టు7వ తేదీ వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కాగా.. కాకాణికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. లాయర్లు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

Next Story