తిరుపతిలో 13 నెలల పాప కిడ్నాప్ కేసులో ట్విస్ట్..ప‌క్కింటి వాళ్లే !

by velandi.Saikiran |   (  Updated:2026-01-22 05:10:59  IST  )

తిరుపతిలో 13 నెలల పాప కిడ్నాప్ అయిన సంఘ‌ట‌న గురువారం చోటు చేసుకుంది.

తిరుపతిలో 13 నెలల పాప కిడ్నాప్ కేసులో ట్విస్ట్..ప‌క్కింటి వాళ్లే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఏపీలోని తిరుపతిలో కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది. తిరుపతిలో 13 నెలల పాప కిడ్నాప్ అయిన సంఘ‌ట‌న గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల చేను స్టార్ లైట్ బిల్డింగ్ సమీపంలో ఈ కిడ్నాప్‌ ఘటన చోటు చేసుకుంది. వీధిలో ఆడుకుంటున్న జయశ్రీ (13 నెలల) అపహరణకు గురైంది.

ఎంత వెతికినా జయశ్రీ క‌నిపించ‌లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు, స్థానికుల‌ను సంప్ర‌దించారు. అయినా జయశ్రీ జాడ దొరుక‌లేదు. దీంతో జయశ్రీ తల్లి సుజిత్రా ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక బాధితురాలు ఇంటి ప‌క్కనే ఉన్న మారెమ్మ, మురుగన్ భార్యాభర్తలు అపహరించినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు. ఆ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసిన ఈస్ట్ సీఐ శ్రీనివాసులు...గాలిస్తున్న‌ట్లు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు సమీపంలో కిడ్నాపర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు పోలీసులు. ఈ సంఘ‌ట‌నపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story