- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD: సమ్మర్ ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి పడిగాపులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతికి భక్తుల తాకిడి పెరిగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి (Tirumala Tirupati)కి భక్తుల తాకిడి పెరిగిపోయింది. వరుసగా మూడు రోజులు సెలవులు, ఇంటర్ రిజల్ట్స్ రావడం, ముందస్తుగానే వేసవి సెలవులు ఇస్తుండటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు (devotees) పోటెత్తారు. దీంతో శని, ఆదివారాలతో పాటు, సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు (Visit to Lord Venkateswara) ఈ రోజు ఉదయం 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.
ఇదిలా ఉంటే ఆదివారం తిరుమల శ్రీవారిని 82,746 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారికి భక్తుల ((devotees)) నుంచి హుండీల ద్వారా రూ. 3.85 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. కాగా రోజు రోజుకు భక్తుల రద్ధీ పెరిగిపోతుండటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వేసవి తాపాన్ని తట్టుకునేందుకు భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నారు.






