బస్సు ప్రమాదం.. 12 మృతదేహాల అప్పగింత

by Muthe.Rajitha |   (  Updated:2025-10-26 12:01:22  IST  )

కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.

బస్సు ప్రమాదం.. 12 మృతదేహాల అప్పగింత
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో బస్సు నుంచి సేకరించి, కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు పోలీసులు. మృతుల కుటుంబసభ్యుల DNA ఆధారంగా మరణించిన వారిని గుర్తించారు. కాగా వారిలో 12 మృతదేహాలు నేడు వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. మిగిలిన 6 మృతదేహాలను కూడా వారి కుటుంబసభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నట్టు కర్నూల్ ఎస్పీ పేర్కొన్నారు.

అయితే మృతుల్లో కొంతమంది బంధువులు ఇంకా రాకపోవడంతో వారి కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు తెలియజేసారు. కాగా బీహార్‌కు చెందిన అమృత్‌కుమార్‌ మృతదేహానికి కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించారు వారి కుటుంబ సభ్యులు.

READ MORE ....

Bus Accident: కావేరి బస్సు ప్రమాదం.. వెలుగులోకి బైకర్ శివశంకర్ మరో సంచలన వీడియో

Next Story