- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోనక్కర్లేదు’
<p>దిశ, ఏపీ బ్యూరో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 203పై తెలంగాణలోని రాజకీయ పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. రాజకీయ లబ్ది కోసమే తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమకు రావాల్సిన కృష్ణా నదీ జలాల వాటాను మాత్రమే తాము తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలను […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 203పై తెలంగాణలోని రాజకీయ పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. రాజకీయ లబ్ది కోసమే తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమకు రావాల్సిన కృష్ణా నదీ జలాల వాటాను మాత్రమే తాము తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలను తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టమేంటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story






