'సింగరేణిలో ఉద్యోగినులపై ఆంధ్రా అధికారి వేధింపులు'

by  |
సింగరేణిలో ఉద్యోగినులపై ఆంధ్రా అధికారి వేధింపులు
X

దిశ, క్రైమ్ బ్యూరో: సింగరేణి సంస్థలో అనైతిక, అక్రమ వ్యవహారాలకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ జనరల్ మేనేజర్ పదవిని కట్టబెట్టడాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. అన్ని రకాల అర్హతలు ఉన్న తెలంగాణ అధికారిని కాదని తీవ్రమైన ఆరోపణలు ఉన్న ఆంధ్రా అధికారిని నియమించడం సరైంది కాదన్నారు. పదేళ్లుగా హైదరాబాద్ కార్యాలయంలోనే తిష్టవేశారని విమర్శించారు. మహిళా ఉద్యోగినులను బ్లాక్ మెయిలింగ్ చేయడంతో పాటు దురుద్దేశంతో పలు రకాల వేధింపులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. గతంలో ఇదే పోస్టుకు తిరస్కరించిన వ్యక్తిని మళ్లీ ఎలా నియామకం చేస్తారని జాదవ్ ప్రశ్నించారు. ఈ అధికారిపై విజిలెన్స్, ఇంటర్నల్ ఆడిట్ తదితర విభాగాల ద్వారా సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed