జబర్దస్త్ షోలో అనసూయకు అవమానం.. పొట్టి బట్టలపై రచ్చ

by  |
Anchor-Anasuya,-Anchor-shiv
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదస్పద ప్రశ్నలు అడుగుతూ.. సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే యాంకర్ శివ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఈసారి ఏకంగా జబర్దస్త్ యాంకర్ అనసూయను టార్గెట్‌పై వ్యక్తిగత జీవితంపై వివాదస్పద ప్రశ్నలు అడిగాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ, నా ఇష్టం అంటూ సెట్ నుంచి వెళ్లిపోయింది. వివరాళ్లోకి వెళితే.. ‘జబర్దస్త్’ కామెడీ షోకు గెస్ట్‌గా వచ్చిన యాంకర్ శివ.. హైపర్ ఆది టీమ్‌లో ఓ పాత్ర చేశాడు. ఈ సందర్భంగా స్కిట్ జరుగుతున్న సమయంలో యాంకర్ అనసూయను టార్గెట్‌ చేస్తూ వివాదస్పద ప్రశ్నలు సంధించాడు. ‘మీరు పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటారు.

Anchor-Anasuya

సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చినా ఆపరా’ అని అడిగాడు. దీంతో ఒక్కసారిగా అవాక్కైన అనసూయ అది నా పర్సనల్ అంటూ రివర్స్ ఎటాక్ చేసింది. పర్సనల్ అయితే ఇంట్లో వేసుకోండి కానీ.. ఇలా పబ్లిక్‌లో వేసుకోవడం ఏంటి అని మళ్లీ మరో ప్రశ్న సంధించాడు. దీంతో అనసూయకు కోపం వచ్చి.. ఎవరిని పడితే వారిని తీసుకొస్తారు అని హైపర్ ఆదిపై కోపంతో వేదిక మీదనుంచి వెళ్లిపోయింది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే.. ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ కావాల్సి ఉంది.

Next Story

Most Viewed